హైడ్రా భారీ ఆపరేషన్
రూ. 750 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
మేడ్చల్, జూన్ 27 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్ పేటలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 750 కోట్ల విలువైన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో సర్వే నంబర్లు 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురైంది. ఈ స్థలంలో పెద్ద పెద్ద భవంతులు నిర్మించి అందులో నివాసముంటున్నారు.
10 ఎకరాలు మిగలగా దానిని కూడా కబ్జా చేశారు. ఫ్రీ కాస్ట్ కాంపౌండ్లు నిర్మించి, తాత్కాలిక షెడ్లు వేశారు. వీటిలో సొంతమనుషులను కాపలా ఉంచారు. రెవెన్యూ అధికారుల లేక మేరకు హైడ్రాధికారులు ఆ స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకొని కబ్జా తొలగించారు. నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ భూమి కాపాడడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.






