5 May, 2026 | 1:52 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

ప్రశాంతంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు

13-02-2026 05:06 PM

చైర్మన్ పీఠానికి స్వతంత్రులే కీలకం

కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 20 వార్డులను రెండు రౌండ్లుగా విభజించి, మొదటి రౌండ్‌లో 10, రెండో రౌండ్‌లో మరో 10 వార్డుల ఓట్లను లెక్కించారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, అనంతరం బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కే. హరిత, అదనపు కలెక్టర్ దీపక్ తివారి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఓట్ల లెక్కింపులో గెలుపొందిన అభ్యర్థులు ఇలా ఉన్నారు:

1వ వార్డు – జాడి వినోద్ (284 ఓట్లు) – స్వతంత్ర

2వ వార్డు – వైరగడే గోవింద్ (195 ఓట్లు) – స్వతంత్ర

3వ వార్డు – మెంగ్రే ఆకాష్ (198 ఓట్లు) – బీఆర్‌ఎస్

4వ వార్డు – బాలకృష్ణ (215 ఓట్లు) – బీఆర్‌ఎస్

5వ వార్డు – స్వప్న రాణి (286 ఓట్లు) – కాంగ్రెస్

6వ వార్డు – చిలివేరు వెంకన్న (264 ఓట్లు) – బీఆర్‌ఎస్

7వ వార్డు – తనకు భార్గవి (223 ఓట్లు) – బీఆర్‌ఎస్

8వ వార్డు – లోనారే తారాబాయి (194 ఓట్లు) – కాంగ్రెస్

9వ వార్డు – సలాం బిన్ అహ్మద్ (193 ఓట్లు) – బీఆర్‌ఎస్

10వ వార్డు – కామ్రే భాగ్యలక్ష్మి (146 ఓట్లు) – స్వతంత్ర

11వ వార్డు – రాపర్తి కార్తీక్ (265 ఓట్లు) – కాంగ్రెస్

12వ వార్డు – ఆత్రం కృష్ణమ్మ (215 ఓట్లు) – కాంగ్రెస్

13వ వార్డు – గుండా స్నేహ (234 ఓట్లు) – కాంగ్రెస్

14వ వార్డు – కొండు భారతి (217 ఓట్లు) – కాంగ్రెస్

15వ వార్డు – అబ్దుల్లా (278 ఓట్లు) – కాంగ్రెస్

16వ వార్డు – దూడల లక్ష్మీ (316 ఓట్లు) – బీఆర్‌ఎస్

17వ వార్డు – ఎం.డి. అహ్మద్ (278 ఓట్లు) – బీఆర్‌ఎస్

18వ వార్డు – కస్తూరి పుష్పలత (169 ఓట్లు) – స్వతంత్ర

19వ వార్డు – గుబుడే నాగబాయి (228 ఓట్లు) – బీఆర్‌ఎస్

20వ వార్డు – జైబ్ షేక్ (191 ఓట్లు) – బీఆర్‌ఎస్

గెలుపొందిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.