19-02-2026 12:00:00 AM
పాఠశాలకు పంపించాలని సూచన
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వేములవాడ ఎగ్జిబిషన్ వద్ద భిక్షాటన చేస్తున్న బాలుడిని జిల్లా ఇం చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు గుర్తించి చైల్ వెల్ఫేర్ కమిటీ ఎదుట జిల్లా సంక్షేమ శాఖ అధికారులు హాజరుపరిచారు. వేములవాడ పట్టణంలోని ఎగ్జిబిషన్ వద్ద మంగళవారం రాత్రి ఓ బాలుడు గాంధీజీ వేషధారణలో భిక్షాటన చేస్తున్నట్లు చైల్ హెల్ప్ లైన్ కు సమాచారం వచ్చింది.
వెంటనే స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మిషన్ వాత్సల్య టీం, చైల్ హెల్ప్ లైన్ టీం ని పంపించారు. వారు బాలుని రెస్క్యూ చేసి బాలల సంక్షేమ సమితి వారి ఆదేశాల ప్రకారము బాలుని పాఠశాలకు పంపించడానికి అతడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించారు. మరోసారి భిక్షాటనకు పంపించినట్లయితే తల్లిదండ్రులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము కేసు నమోదు చేస్తామని జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం హెచ్చరించారు.