calender_icon.png 19 February, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ తప్పిన పల్లె ప్రకృతి వనాలు

19-02-2026 12:00:00 AM

నాడు కళకళ -నేడు విలవిల..

ప్రజాధనం వృథా

-పర్యవేక్షణ గాలికి..

కోనరావుపేట ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో 28 గ్రామ పంచాయితీలు ఉండగా ప్రతి గ్రామపంచాయతీ లో ఉన్న పల్లె పకృతి వనాలు కళ తప్పిన పల్లె ప్రకృతి వనాలుగా మిగిలిపోయాయి. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావర ణం,ప చ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభు త్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో క్షత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పల్లె పకృతి వనాలు వృథగా వదిలేశారు. గ్రామాల్లో కరువైన ఆహ్లాదం. పట్టించుకోని అధికారులు కళ తప్పిన పల్లె ప్రకృతి వనాలు లక్షలు ఖర్చుచేసి వృథగా వదిలేశారు.

గ్రామాల్లో కరువైన ఆహ్లాదం

పట్టించుకోని అధికారులు ప్రజలకు ఆహ్లాదకర మైన వాతావరణం, పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో క్షత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ, అధి కారుల పర్యవేక్షణ లేక ప్రకృతి వనాలు నేడు ఎడారిలా మారాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారు.

తప్పా సంరక్షణకోసం నీరు పోయడం విస్మరించారు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటకపోవడంపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేశారు.

లక్షలు ఖర్చుచేసి పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్వహణను గాలికి వదిలేశారు. కొన్ని పల్లెప్రకృతి వనాల్లో చుట్టూ వేసిన కంచెలు పోల్లు విరగకొట్టడంతో పశువులు, మేకలు సంచరిస్తున్నాయి. మరికొన్ని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలకు నీరు అందక ఎండిపోయాయి. పల్లె ప్రకృతి వనాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంచాయ తీలకు అందించిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు నిరుపయోగంగా మారాయి. 

కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండటంతో ట్యాంకర్లు మూలనపడేశారు. ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు చొరవ తీసుకొని పల్లెప్రకృతి వనా లపై దృష్టి సారించాలని కోనరావుపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.