20-02-2026 12:28:12 AM
ముకరంపుర, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): కరీంనగర్ 10వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య గురువారం హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రరావు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, తదితరులు పాల్గొన్నారు.