పర్యావరణ పరిరక్షణలో మరింత చురుకుగా సహకరించండి
05-06-2026 04:44 PM
బోథ్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించిన వారికి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్శిష , ఎస్పీ అఖిల్ మహాజన్. డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ ల చేతుల మీదుగా సోనాల మండల కేంద్రానికి చెందిన సుధీర్ రెడ్డి బోత్ మండలంలోని మరల పెళ్లి గ్రామానికి చెందిన తప్ప శంకర్ లకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ పరిరక్షణలో అడవుల పాత్ర కీలకమని అడవుల పరిరక్షణకు చేసిన కృషిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను సేవా దృక్పథంతో చేపట్టాలని వారు కోరారు.






