29 July, 2026 | 1:00 AM

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం

29-07-2026 12:23 AM
  1. వర్షాకాలంలో అంతరాయం లేకుండా అందించాలి
  2. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, జూలై 28, (విజయ క్రాంతి) వర్షాకాలంలో గృహ అవసరాలకు , రైతంగానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  విద్యుత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  రైతులకు నిర్ణీత సమయాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ప్రమాదకరంగా మారిన లూజు విద్యుత్ వైర్లను గుర్తించి పకడ్బందీగా సరిచేయాలని ఆదేశించారు.

రైతులు రూ.9,100 ప్రభుత్వానికి చెల్లిస్తే ఒక కిలోమీటరు వరకు విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఈ పథకాన్ని అర్హులైన రైతులు వినియోగించుకోవాలని కోరారు. అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలని విద్యు త్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 132 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ రవి ప్రసాద్,  సూర్య నాయక్, శంకర్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు