29 July, 2026 | 1:00 AM

‘డబుల్’ ఇండ్లు నిరుపేదలకే కేటాయించాలి

29-07-2026 12:23 AM

దేశ ప్రజలను నిత్యం మోసం చేసే పార్టీ కాంగ్రెస్..

మంత్రులు కలెక్టర్ల పేరుతో పైరవీ లేఖలు

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి, జులై 28 (విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లను నిరుపేదల కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో ప్రజలను నిత్యము మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ మధ్యకాలంలో అనర్హులకు కేటాయించిన వారి వివరాలను ఆధారాలతో సహా మీడియాకి విడుదల చేశారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు కేటాయించకుండా మంత్రుల, కలెక్టర్ల అనుచరులకు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గంలోని కైతలాపూర్ లో కెసిఆర్ హయాంలో 145 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించారని, నాలా పక్కన నివసిస్తున్న అమృత నగర్ తండా వాసులకు కేటాయించాలని డిమాండ్ చేశామని అందుకు అనుగుణంగా వాటిని నిరుపేదలకు కేటాయించే విధంగా ప్రయత్నం చేశామన్నారు. నిరుపేదలైన విలేకరులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కలెక్టర్కు వినతి పత్రం అందించామని దానిపై స్పందన మాత్రం లేదన్నారు.

హౌసింగ్ బోర్డ్ విసి తరఫున, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న ఓ మహిళకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించారని ఆధారాలను బయటపెట్టారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున, కుత్బుల్లాపూర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రత్యూషకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించారని ఇలా వారి అనుచరులు తెచ్చుకుంటూ పోయారని ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ పైరవీ తో నరేష్ కుమార్ అనే వ్యక్తికి, మాజీ డిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ అల్లుడు పైరవీతో శైలజకు ఇలా మంత్రులు కలెక్టర్లు లెటర్లు రాయడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారని ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు.

ఇంతటితో దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హెచ్చరించారు. కెసిఆర్ ప్రభుత్వంలో మహిళలకు మాత్రమే ఇళ్లను కేటాయించే వారిని, ప్రస్తుతం పురుషుల పేరుతో కూడా కేటాయిస్తున్నారని ఇది విడ్డూరంగా ఉందన్నారు. కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఎవరికి పడితే వారికి పిల్లను కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా లోపాయికారితనంతో లేఖల పేరుతో డబ్బులు గుంజుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చిన వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లను కేటాయిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మేడ్చల్ కలెక్టర్ నిష్పక్షపాతంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నారన్నారు.