5 June, 2026 | 5:48 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

గ్రామసభలు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఉండాలి: కంచర్ల హిమశ్రీ

05-06-2026 04:41 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): 18వ వార్డు డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ 99 రోజుల ప్రజాపాలనలో, ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక పంజాబీ గడ్డలో పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామసభలు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. హామీని తక్షణమే నెరవేర్చాలని ఆమె ఈ సందర్భంగా అధికారులకు కోరారు.

అదేవిధంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాలను వెంటనే ప్రవేశపెట్టి, పేదలకి అధికారులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఇండ్లు నిర్మించాలని,  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు పరిశుభ్రత పట్ల చర్యలు  తీసుకోవాలని మున్సిపల్ అధికారులకి సూచించారు. రానున్న వర్షం గగనంలో రోగాలు ప్రబలకుండా  చూడవలసిన బాధ్యత  మున్సిపల్ అధికారులు, ప్రాథమిక వైద్య కేంద్రాలపై ఉందని ఆమె ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి మాట్లాడారు.

18వ డివిజన్లో ఉన్న మహిళలందరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి, మన వార్డుని ప్రగతి పథంలో నడిపి ఉండే విధంగా అందరు సహకరించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు. భూగర్భ జలాలు  అడుగంటకుండా  ఉండాలంటే ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంత లు నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని  సూచించారు. వర్ష పు నీటిబొట్టుని భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంటలు నిర్మిస్తే,భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి.

ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకుని,18వ డివిజన్  ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ వార్డ్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి,మున్సిపల్ ఏఈ శ్రీకాంత్, విద్యుత్ అధికారులు, డాక్టర్ రాము, శంకరమ్మ, శ్రీనివాస్, పంజాబ్ గడ్డ వార్డ్ అభివృద్ధి కమిటీ సభ్యులు,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య, రంగారావు పాటి మోహన్రావు,హరినాథ్, కోటేశ్వరరావు,అమిత్, కోటి, మండల రాజేశ్వరరావు నిఖిల్,భూపేష్,తదితరులు పాల్గొన్నారు.