విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి
ఘట్ కేసర్, జూలై 28 (విజయక్రాంతి) : మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాగం అర్జున్ ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి బీజేపీ లడాయి‘ కార్యక్రమంలో భాగంగా ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని మెగా ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలకు మద్దతుగా విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. 15 నెలలు గా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థు ల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు. ఆ హక్కును కాలరాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మీడియా కన్వీనర్ ప్రవీణ్ రావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి శివనాయక్, నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు బసవరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్, విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






