22 May, 2026 | 5:01 AM

ఆవిరి వంట.. మున్నాళ్ల ముచ్చట..

22-05-2026 01:02 AM

ఉట్నూర్, మే 21 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థులకు కట్టెల పొయ్యితో పాటు గ్యాస్ పై వంటలు కాకుండా ఆవిరి యంత్రాలతో చేసిన వంటలు మున్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రభుత్వ సంకల్పం నీరుగారింది. 2017-18 విద్యా సంవత్సరంలో సరఫరా చేసిన యంత్ర సామాగ్రి.. వంట పాత్రలు మూలకు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని 124 ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసిన స్టీమర్ కుక్కర్స్ లు కొన్ని నెలలకే  వినియోగించకుండా నిరుపయోగంగా మారాయి.

ఆశ్రమ పాఠశాలలకు సరఫరా..

రాష్ట్ర ప్రభుత్వం ఆవిరి వంట యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 328 గిరిజన ఆశ్ర మ పాఠశాలకు సరఫరా చేయగా.. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 124 ఆశ్రమం పాఠశాలకు సరఫరా చేశారు. ఒక్క ఆశ్రమ పాఠశాలకు ఆవిరి వంట పాత్రలు, మంత్రాలకు  మూడు లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఆశ్రమ పాఠశాలలో విజయవంతం అయితే క్రమక్రమంగా అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తర్వాత గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. ఆవిరి యంత్రాలతో వంట చేయ డంపై ఆశ్రమ పాఠశాల నిర్వాహకులకు, వంట మనుషులకు అరకుర శిక్షణ ఇవ్వడంతో వారికి సరైన అవగాహన లేక వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. దీంతో యంత్రాలు మూలపడ్డాయి.

వంట గ్యాస్ కొరకు ఇబ్బందులు..

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఒంటెగా సర్పరులు ఇబ్బందులు తలుచుతున్నాయి. ఈ క్రమంలో ఆశ్రమ పాఠశాలలో విద్యనుభ్యసించి గిరిజన విద్యార్థులకు మూడు పూటల భోజనాల కొరకు గ్యాస్ కొరకు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు కట్టెలతో వంట చేయడంపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా నిరుపయోగంగా ఉన్న స్టీమర్ కుక్కర్లను మరమ్మతులు చేయించి వర్షాకాలంలో ఆవిరి వంట చేసి అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు..