calender_icon.png 16 February, 2026 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరెత్తించిన విజయోత్సవ సంబరాలు..

16-02-2026 03:17:06 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబీ మోగించిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు హోరెత్తయి. మున్సిపల్ చైర్ పర్సన్ గా దావ స్వాతి, వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విజయోత్సరాలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఈ విజయోత్సరాలి క్యాంప్ ఆఫీస్ వరకు సాగింది. ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు సంబరాలను హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చిలుముల శంకర్, నాతరి స్వామి, ముచ్చర్ల మల్లయ్య, నర్సింగరావు, సంతోష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.