calender_icon.png 9 February, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బంగ్లా’ మాజీ మంత్రి రమేష్ చంద్రసేన్ మృతి

09-02-2026 02:15:34 AM

ఆయనది వ్యవస్థీకృత హత్య  అని ఆందోళనకారుల ఆరోపణ 

ఢాకా, ఫిబ్రవరి 8 :  బంగ్లాదేశ్‌లో హిందూ నేతలపై హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి రమేష్ చంద్రసేన్(86) పోలీసుల కస్టడీలోనే తుది శ్వాస విడిచారు. 18 నెలల క్రితం ఆయనపై ఓ మూక దాడి చేయ గా.. సాయం చేయాల్సిన పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చంద్రసేన్‌ను జైల్లోనే ఉంచుతూ.. ఆయనపై అనేక కేసులు పెడుతూ వస్తున్నారు. అయితే, ఈ మధ్య ఆయన ఆరోగ్యం క్షీణించింది.

బెయిల్ కావాలంటూ పలుమార్లు  ఆయన కోర్టులో మొరపె ట్టుకున్నా  బెయిల్ మంజూరు కాలేదు. కనీసం ఆయన్ను అధికారులు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఈక్రమంలోనే శనివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం మరణం కాదని, వ్యవస్థీకృతమైన హత్యని మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అవామీ లీగ్ పార్టీకి చెందిన రమేష్ చంద్ర సేన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప విద్యావేత్త, పార్లమెంటేరియన్. బంగ్లాదేశ్ విద్యా రంగంలో, రాజకీయా ల్లో ఆయన దశాబ్దాల కాలం పాటు విశేష సేవలు అందించారు. అయితే 18 నెలల క్రితం ఒక అల్లరి మూక ఆయనపై దాడి చేయగా.. బాధితుడైన చంద్రసేన్‌ను రక్షించాల్సింది పోయి పోలీసులు ఆయన్నే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా స్పష్టంగా వెల్లడించకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును ఆయనపై బనాయిస్తూ వచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.