22 May, 2026 | 9:29 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

రిలేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ: దాసోజు

08-01-2026 01:18 AM

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంత వైరుధ్యా లు ఉన్న పార్టీలని, పిల్లి, ఎలుకలు అయినా కలిసి వుంటాయేమో కానీ కాంగ్రెస్, బీజేపీ కలవవని, కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రిలేషన్‌లో ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోమాట్లాడారు. పని గట్టుకుని బీఆర్‌ఎస్‌పై విష ప్రచారం చేస్తున్నాయని, మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డ ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.