18 May, 2026 | 3:04 AM

ప్రతిభావంతులైన విద్యార్థినులకు కలెక్టర్ సత్కారం

18-05-2026 02:11 AM

నంగునూరు, మే 17: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట లోని ఇందిరానగర్ పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆదివారం ’విద్యా విజయోత్సవం’ నిర్వహించారు.

ఇటీవల పదో తరగతి ఫలితాల జడ్పీ పాఠశాలల విభాగంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన బొమ్మిడి అమూల్య (నర్మెట్ట),రెండో ర్యాంకు సాధించిన జీ. సహస్ర భారతి (రాజగోపాలపేట్)లతో పాటు, జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచి  క్రీడాకారిణి బానోతు హరిణి ప్రియ (గట్లమల్యాల)లను జిల్లా కలెక్టర్ హైమావతి, డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సత్కరించారు.విద్యార్థినులకు రూ.10,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు రామస్వామి,రమేష్,ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఎం.రమేష్, సత్యనారాయణ,వ్యాయామ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.