దంచి కొడుతున్న ఎండలు
18-05-2026 02:11 AM
నిర్మల్ మే 17 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 45 డిగ్రీల పైగా ఎండలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండలకు తోడు వేడి గాల్పులు వేయడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అగ్గిదగడి రాజేష్కుంటుంది. దీంతో రోడ్లపై ప్రయాణించేవారు వృద్ధులు చిన్నపిల్లలు ఎండ వేడిమి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాలు పల్లెల్లో పగటిపూట ఎండల కారణంగా జనాలు ఎవరు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. రోడ్లపై చిరు వ్యాపారం చేసేవారు వ్యాపారం జరగక ఇబ్బందికి గురవుతున్నారు






