1 June, 2026 | 1:21 AM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులపై కలెక్టర్ అసంతృప్తి

01-06-2026 12:45 AM

సమగ్ర కార్యాచరణకు ఆదేశం

సూర్యాపేట, మే 31 (విజయక్రాంతి) : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ మేనేజ్ నిర్మాణ ప నుల తీరుపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివా రం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో ప్రజారోగ్య మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ’కె.ఎన్.ఆర్ కన్ స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడు తూ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పను లు అత్యంత నిర్లక్ష్య పూర్వకంగా సాగుతున్నాయని మండిపడ్డారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైపులు, మ్యాన్ హోల్ నిర్మాణం కోసం రో డ్లను తవ్వేసి, నెలల తరబడి వాటికి సిమెంట్ కాంక్రీట్ పనులు చేయకుండా వదిలేయడం సరికాదన్నారు. దీనివల్ల సాధారణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతోందన్నారు. పైపులైన్లు, మ్యాన్ హోల్ లు నిర్మాణం పూర్తయిన వెంటనే తవ్విన గోతులను పూడ్చకపోవడం ముమ్మాటికీ నిర్లక్ష్యమేనన్నారు. తవ్వకాల సమయం లో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్ లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలం లో పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలు తా గునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని అధికారులను హెచ్చరించారు.

పనుల్లో వే గం పెంచడంతో పాటు ప్రజల ఇబ్బందుల ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప నులు చేపట్టిన అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి రోడ్డు వారీగా వివరాలు, టైం లైన్ తో యాక్షన్ ప్లాన్ ను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్ర జారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి, దెబ్బతిన్న మౌలిక వసతు లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మున్సిపల్ అధికారులు కూడా పర్య వేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో నల్గొండ ప్రజారోగ్య శాఖ సూపరిం టెండింగ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్, ప్రజారోగ్య శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు అనిల్ కుమార్, రమాదేవి, కేఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.