29 July, 2026 | 9:49 PM

Breaking News

భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •  

ఆగస్టు 15 లోపు యూనిఫాంలు అందించాలి

29-07-2026 08:37 PM

డీఆర్‌డీఓ దత్త రావు

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సెర్ప్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లో నిర్వహిస్తున్న స్కూల్ యూనిఫామ్ స్టిచింగ్ సెంటర్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టిచింగ్ పనుల పురోగతిని పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఆగస్టు 15లోపు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ నాణ్యమైన యూనిఫాంలు పంపిణీ అయ్యేలా పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్టిచింగ్ పురోగతి, ఉత్పత్తి లక్ష్యాలు, నాణ్యత ప్రమాణాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీఎం పోమా నాయక్, అకౌంటెంట్ కరుణశ్రీ, సీసీలు పాల్గొన్నారు.