సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రమేష్
29-07-2026 08:38 PM
తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా దాసరి రమేష్ ను(పిప్పల్ కోటి) బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా జాదవ్ రంజన ( భీంపూర్ ), ఉపాధ్యక్షులుగా ఇద్దరిని జజ్జరి రాకేష్ యాదవ్( అంతర్గాం), సిడం కేశవ్ (బెల్సారి రాంపూర్), సంయుక్త కార్యదర్శిగా కామన్ వార్ అశోక్ ( అర్లి టి) లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల సర్పంచులు వారిని శాలువాతో సన్మానించి అభినందించారు.






