6 June, 2026 | 2:06 AM

ప్రాజెక్టుల పరిశీలనలో సీఎం రేవంత్‌రెడ్డి

06-06-2026 12:46 AM
  1. రెండో రోజు మంత్రులతో కలిసి పాలమూరు ప్రాజెక్టు పరిశీలన
  2. ప్యాకేజీ 2, 3 హెడ్ రెగ్యులేటర్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన

నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని రెండవ రోజు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ముందుగా కొల్లాపూర్‌లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో అల్పాహారం అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని కలుసుకుని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ 2, 3 హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను నిపుణులతో కలిసి సీఎం తిలకించారు. ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. నార్లాపూర్ రిజర్వాయర్ (అంజనగిరి) డెలివరీ సిస్టమ్‌ను సీఎం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 6.4 టీఎంసీల సామర్థ్యంతో రూ పొందించిన ఈ రిజర్వాయర్ ద్వారా 8 పంపుల వ్యవస్థతో నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

పాల మూరువూరంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని ప్రభు త్వం నిర్ణయించగా, శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి ప్యాకేజీ 4, 5లకు పంపే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు వివరించారు. ప్యాకేజీ 2, 3 సుమారు 8.3 కిలోమీటర్లు, ప్యాకేజీ 4 సుమారు 16 కిలోమీటర్ల పొడవు కలిగి ఉం డగా, ఏదుల పంప్హౌస్కు నీటిని తరలించేందుకు ప్రత్యేక డిజైన్ చేసినట్లు వివరించారు.

నాలుగు పంపులు సిద్ధంగా ఉండగా మరో నాలుగు పంపులు కూడా వినియోగానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం కేఎల్‌ఐ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అనంత రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ మూడో లిఫ్టును సందర్శించారు. 2020 నాటికి రూ 3,300 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేయగా, 2023 నుంచి ఇప్పటి వరకు రూ. 800 కోట్లను ఖర్చుచేసి ప్రాజెక్ట్ పనులను కొనసాగించినట్టు, పెండింగ్‌లో ఉన్న మిగతా సివిల్ పనులను రూ.90 కోట్లతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక్కడ మొత్తం 10 పంపులు ఉండగా 5 పంపులను ఫిట్ చేసి ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరి గేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12.30 లక్ష ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అం దించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.