6 June, 2026 | 3:13 AM

కాలుష్య కారకాల నియంత్రణ పద్ధతులను ఆచరించాలి

06-06-2026 12:44 AM

పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ

కోదాడ, జాన్ 5: పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అన్ని రకాల కాలుష్య కారకాలను నియత్రించే చర్యలను బాధ్యతతో చేపట్టి, ఆచరించాలని పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ ప్రజలను కోరారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని హుజుర్నగర్ రోడ్ లో డివైడర్లలో ఎండిపోతున్న చెట్ల వద్ద పర్యావరణహిత నినాదాలతో ఉన్న చార్టులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వ్యర్ధాల నిర్వాహణ పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. వారి నిర్లక్ష్యానికి ని దర్శనమే  డంపింగ్ యార్డులుగా మారిన పట్టణ శివార్లలో సర్వీస్ రోడ్లతో పాటు డివైడర్లలో ఎండిపోతున్న మొక్కలు. వాటికి పా దులు తీసి సరిపడ నీళ్లు పోయాలని మున్సిపల్ అధికారులను కోరారు.

అనంతరం మా స్టర్ మైండ్స్ స్కూల్ లో ఉపాధ్యాయులతో నేటి మనజీవన విధానంలో అలవాటుగా మారిన మన ప్రతి చర్య వల్ల జరిగే కాలుష్య కారకాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో  మాస్టర్ మైండ్స్ స్కూల్ హెచ్‌ఎం కిరణ్ కుమార్, డైరెక్టర్ ర మేష్, ఉపాధ్యాయులు సుజాత, శ్రీలత రాం శెట్టి శ్రీనివాస రావు,మల్లేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాస్, అన్విత, విద్యార్థులు పాల్గొన్నారు.