calender_icon.png 9 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడికోటలో సీఎం కప్ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం

09-02-2026 06:42:04 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ గడికోటలోని మైదానంలో సోమవారం సీఎం కప్ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

పోటీల్లో ఇండియన్ రౌండ్ 30 మీటర్ల బాలికల విభాగంలో జి. సహస్ర, బాలుర విభాగంలో ఎస్.కె. రెహాన్ ఎంపికయ్యారు. ఇండియన్ రౌండ్ 40 మీటర్లలో బాలికల విభాగంలో ఎన్. భావన, బాలుర విభాగంలో పీఆర్. రామచరణ్ విజేతలుగా నిలిచారు. రికర్వ్ రౌండ్‌లో బాలికల విభాగంలో బి. వర్షిణి, పి. నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్. స్నేహిత్ ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్ల విభాగంలో శ్రీ వైష్ణవి విజయం సాధించారు.

జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను నిర్వాహకులు అభినందించారు. వీరు ఖమ్మంలో నిర్వహించే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, విలువిద్య శిక్షకులు ప్రతాప్ దాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖర్, సిద్ధరాములు, రాజేందర్, రమేష్ గౌడ్, జాతీయ క్రీడాకారిణి సింధుజ తదితరులు పాల్గొన్నారు.