27 April, 2026 | 3:26 AM

రఫ్ఫాడించిన రబాడ

27-04-2026 01:45 AM

చిత్తుగా ఓడిన చెన్నై

సాయి సుదర్శన్ విధ్వంసం

ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటా న్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన గుజరాత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నైని చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సా ధించింది. బౌలింగ్‌లో రబాడ, బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ అదరగొట్టారు. దీం తో చెన్నైకి ఐదో ఓటమి తప్పలేదు.

చెన్నై, ఏప్రిల్ 26 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఆడతాడని అభిమానులు ఆశ లు పెట్టుకున్నా చెన్నై తుది జట్టులో మార్పు లు చేయలేదు.  బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని సఫారీ పేసర్ రబాడ బెంబేలెత్తించాడు. సం జూ శాంసన్, ఇంపాక్ట్ ప్లేయర్ ఉర్విల్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమం లోనే సీఎస్కే మరో రెండు వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్(0), బ్రెవిస్(2) కూ డా ఫెయిలయ్యారు. దీంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడింది.

ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆదుకున్నాడు. శివమ్ దూబేతో కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దూబే 17 బంతుల్లో 22 (3 ఫోర్లు, 1 సిక్సర్ ) ఔటవగా.. తర్వాత కార్తీక్ శర్మ (15), ఓవర్టన్ (18) పరుగులతో పర్వాలేదనిపించా డు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెం చరీ పూర్తి చేసుకోవడంతో పాటు చివర్లో భారీ షాట్లతో అలరించాడు.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. రుతురాజ్ 60 బంతు ల్లో 74 (6 ఫోర్లు, 4 సిక్సర్లు) నాటౌట్ గా ని లిస్తే. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శభ్ మన్ గిల్, సా యి సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చా రు. తొలి వికెట్ కు 6.2 ఓవర్లలో 58 పరుగులు జోడించారు. గిల్ 23 బంతుల్లో 33 (1 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటైనా సాయి సుదర్శన్, బట్లర్ దూకుడుగా ఆడు తూ మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చేశారు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 90 పరుగుల భాగ స్వామ్యం నెలకొల్పారు. గత మ్యాచ్‌లో సెం చరీ చేసిన సాయి సుదర్శన్ మరోసారి దు మ్మురేపాడు. తన ఫామ్ కొనసాగిస్తూ చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ జోరుతో గుజరాత్ టైటా న్స్ 3.2 ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. సాయి సుదర్శన్ 46 బంతుల్లో 87 (4 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేయగా.. బట్లర్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

స్కోరు బోర్డు 

చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ : 158/7 ( రుతురాజ్ గైక్వాడ్ 74 నాటౌట్, శివమ్ దూ బే 22, ఓవర్టన్ 18 ; రబాడ 3/25, అర్షద్ ఖాన్ 2/43 )

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 162/2 ( సాయి సుదర్శన్ 87, గిల్ 33 , బట్లర్ 39 నాటౌట్ ; అకిల్ హొస్సేన్ 1/46, నూర్ అహ్మద్ 1/29)