5 June, 2026 | 3:51 PM

నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల

05-06-2026 02:45 PM
  1. నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు
  2. పట్టణ అభివృద్ధిపై చర్చ
  3. సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్ష
  4. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
  5. కమిషనర్‌ను సత్కరించిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు

జిన్నారం/ అమీన్ పూర్ జూన్ 5:  ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్‌ను మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్ , వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వార్డుల ప్రగతిపై కమిషనర్‌తో చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.