27 July, 2026 | 3:25 AM

తైక్వాండో ఛాంపియన్‌షిప్ విజయవంతం

27-07-2026 02:34 AM

గద్వాల టౌన్ జూలై 26 : జోగులాంబ గద్వాల్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బృందావన్ గార్డెన్లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్లో సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.సబ్ జూనియర్,క్యాడెట్,జూనియర్,సీనియర్ విభాగాల్లో కొరిగి, పూమ్సే పోటీలు నిర్వహించగా విజేతలు ఆగస్టు 8,10 తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థా యి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

పోటీలను డీవైఎస్వో రామలింగేశ్వర గౌడ్, కృష్ణయ్య, అయ్యప్ప రెడ్డి ప్రారంభించారు. తైక్వాండో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణ పెంపొందిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీహరి, కోచ్లు శ్రీనివాస్ శెట్టి, రంగస్వామి,మారుతి,శ్రీను,రామేశ్వరి,మల్లికార్జున్ గౌడ్,లింగేష్,విష్ణు,సుధీర్ తో పాటు సీనియర్ క్రీడాకారులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.