మహిళ మెడలో గొలుసు చోరీ
24గంటల్లో దొంగని పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు
వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ, ఏప్రిల్ 29 : మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ సంప్రదాయ హోటల్ సమీపంలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడపై నుండి బంగారు గొలుసు లాక్కెల్లిన ఘటన జరిగింది. విషయం తెలిసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు సాంకేతికత ఆధారంగా 24 గంటల్లోనే దొంగని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరు కి చెందిన బాజం గోపీచంద్ (19) అనే యువకుడు ఆటో వాటర్ ప్లాంట్ నడుపుతూ బాపూజీ నగర్ లో నివాసముంటున్నాడు.
వ్యసనాలకు బానిసగా మారిన గోపి చంద్ ఓ కారుని అద్దెకు తీసుకొని ఆక్సిడెంట్ చేశాడు. కారు రిపేర్ చేయడానికి రెండు లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిసి, దొంగతనాలకి పూనుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 27 రాత్రి సంప్రదాయ హోటల్ రోడ్డులో ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుండి వచ్చి ఒక మహిళ మెడ పై ఉన్న సుమారు 4 తులాల బంగారు పుస్తెలతాడు, చైన్ లను లాక్కొని వెళ్ళాడు.
బాధితురాలి పిర్యాదు మేరకు చైన్ స్నాచింగ్ కేస్ ను ఛాలెంజ్ గా తీసుకున్న వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు, యస్‌ఐ సైదిరెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా విస్తృత గాలించారు. బుధవారం బంగారు ఆభరణాలను అమ్ముటకు యత్నిస్తుండగా చాక చక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.
నిందితుని వద్ద సుమారు 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఒక బైక్ సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో చైన్ స్నాచింగ్ చేసిన దొంగను పట్టు కొని సొత్తు రికవరీ చేయడం పట్ల సీఐ నాగభూషణం రావు, ఎస్త్స్ర సైది రెడ్డి లతో పాటు హెడ్ కానిస్టేబుల్ రాజారామ్ నాయక్, కానిస్టేబుళ్లు నల్లగంతుల శ్రీను, గద్దల హుస్సేన్, వెంకటేశ్వర్లు, వీర బాబు, నర్సింహా, ప్రసాద్ లను డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






