భార్య, ఇద్దరు చిన్నారులు అదృశ్యం.. పోలీసులకు భర్త ఫిర్యాదు
27-06-2026 11:14 AM
బాన్సువాడ, జూన్ 27 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపూర్ గ్రామానికి చెందిన మంగలి లచ్చయ్య తన భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య మంగలి కల్పన (27), కుమార్తెలు అక్షర (4), శ్రీవిద్య (2) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో శనివారం పోలీసులను ఆశ్రయించారు. కల్పన ఇంటి నుంచి వెళ్లే సమయంలో గులాబీ రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, ఆమె ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






