రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ
27-06-2026 11:18 AM
బోధన్,జూన్ 27(విజయ క్రాంతి): రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బోధన్ మండల వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్పూర్తయిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా బుక్ జీరాక్స్ ప్రతులను సమర్పించాలన్నారు. జులై 5వ తేదీలోగా దరఖాస్తు చేసేందుకు గడువు విధించినట్లు వెల్లడించారు.






