ఇంట్లోకి దూరిన లారీ, డ్రైవర్ కు గాయాలు
రెండు లక్షల నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని వెంకన్న ఆవేదన.
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రమాదశాత్తు ఇంట్లోకి లారీ దూరడంతో, కిరాణం షాపులో సామాను నష్టం వాటిల్లి, డ్రైవర్ కు గాయాలైన సంఘటన శనివారం ఉదయం తిరుమలగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టిఎన్20 బిఎస్ 0268 లారీ అతి వేగంతో డబ్బా వెంకన్న ఇంట్లోకి రావడం జరిగింద. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే కిరాణా షాపు పూర్తిగా ధ్వంసం అయిందని రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు పూర్తిగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట నుంచి కేసు నమోదు చేసుకొని విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.






