30 April, 2026 | 3:19 AM

పదిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

30-04-2026 12:52 AM

అలంపూర్, ఏప్రిల్ 29: బుధవారం వెలువడిన పదవ తరగతి వా ర్షిక పరీక్షల్లో ప్రభు త్వ పాఠశాలలో వి ద్యను అభ్యసించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభని కనపరిచారు. మానవపాడు మండల కేంద్రంతోపా టు ఆ యా గ్రామాల్లో ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ శివ ప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 97 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 95 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ తెలిపారు.

అమరవాయికి చెందిన అఖిల్ సాయి 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి మండల టాపరుగా నిలిచారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థినిలు వంద ఉత్తీర్ణత అయినట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు ఎంఈఓ అ భినందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో వంద ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఎంఈఓ శివప్రసాద్ తెలిపారు.