11 April, 2026 | 4:27 AM

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి

11-04-2026 02:29 AM

చేగుంట ఏప్రిల్ 10: చేగుంట పట్టణ కేంద్రంలో పట్టణానికి చెందిన లబ్ధిదారుడు దాసరి పద్మ, కృష్ణ దంపతుల  ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ తో కలిసి శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, సి హెచ్ శ్రీనివాస్ రెడ్డికి,నాకు ఇల్లు రావడానికి కృషి చేసిన మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ కి, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ సందర్భంగా సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర సంవత్సరాలలో మన దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సౌంత ఇంటి కలను నెరవేర్చాము అని అన్నారు. అతిత్వరలోనే చేగుంట పట్టణంలో కూడా 50 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నాము అని అన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది అని అన్నారు..

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి ఆశీర్వాదాలు అందుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో   చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, బోనాల సర్పంచ్ సుకన్య నాగులు, ఉపసర్పంచ్ నాగరాజు, ఎఎంసి డైరెక్టర్ బాల్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు ఎం .శ్రీనివాస్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్,యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,గ్రామ వార్డు సభ్యులు నాగులు, నరేశ్,భూపతి, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.