శిక్షణ పొందిన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రం అందజేత
మఠంపల్లి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Gram Panchayat elections) వార్డు సభ్యులుగా పోటీ చేసినప్పుడు గ్రామాభివృద్ధితో పాటు పంచాయతీ వార్డు అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని ఓటర్ల ను ప్రసన్నం చేసుకుని గెలుపొందిన పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన అంశాలతో పాటు గ్రామాభివృద్ధి,ప్రభుత్వ పథకాలు,పంచాయతీ విధులు,నిధుల పై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా ఎంపిక చేసి వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్నారు. మఠంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల అభివృద్ధి అధికారి జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారం రెండోవ గ్రూప్ లో శిక్షణ పొందిన వార్డు సభ్యులకు ధృవీకరణ పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




