2 May, 2026 | 4:09 AM

వ్యాపారుల నెత్తిన గ్యాస్ బండ

02-05-2026 02:54 AM
  1. వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 వడ్డన
  2. తక్షణం అమలులోకి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  3. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.2,321 నుంచి రూ.3,314కి చేరిక
  4. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు: కేంద్రం
  5. ఇది ఎన్నికల వడ్డన.. పెట్రోల్ ధరలూ పెంచుతారు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్
  6. గ్యాస్ సిలిండర్ ధరల స్థిరీకరణలో కేంద్రం విఫలం: ఏఐసీసీ చీఫ్ అధ్యక్షుడు ఖర్గే

న్యూఢిల్లీ, మే ౧: వ్యాపార రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌నిచ్చింది. వాణిజ్య సిలిండర్ (19 కిలోలు) ధరను శుక్రవారం ఏకంగా రూ.993 పెంచింది. పెంచిన ధరలు వెనువెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో సగటున రూ.౨,౩౦౦ ఉండే ధర ఏకంగా రూ.౩ వేలు దాటింది. ఉదాహరణకు గురువారం వరకు హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,321 ఉండగా, శుక్రవారానికి ఆ ధర రూ.3,314కు చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగానే ఇంధన ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర స్పష్టం చేసింది. అయితే.. సామాన్యులకు మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది. గ్యాస్ సరఫరాలో ఎలాం టి కొరత లేదని స్పష్టం చేసింది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువులో కూడా మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఒక బుకింగ్ నుంచి మరో బుకింగ్ మధ్య వ్యవధి 25 రోజుల సమయం ఉండాలని, అదే గ్రా మీణ ప్రాంతాల్లోనైతే ఆ వ్యవధి 45 రోజులు ఉంటుందని ప్రకటించింది. గ్యాస్ డెలివరీ సమయంలో ఏజెన్సీ నిర్వాహకులకు ఓటీపీ చెప్పడం ఇకపై తప్పనిసరి. వినియోగదారులు కేవైసీ అప్డేట్ కూడా చేయించుకో వాల్సి ఉంటుంది. మరోవైపు, పైపుల ద్వారా గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్పీజీ సిలిండర్ వాడొద్దని, వాటిని తక్షణం ఏజెన్సీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లు వినియోగించే వారికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయవద్దని ఆదేశించింది. మ రోవైపు వాణిజ్య ధరల పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. గ్యాస్ సిలిండర ధరల స్థిరీకరణ విషయంలో కేం ద్రం విఫలమైందని విమర్శించారు. ప్రధాని మోదీ మాటలకు, చేతలకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. 

ఎన్నికల వడ్డన: ఏఐసీసీ అగ్రనేత రాహుల్

వాణిజ్య సిలిండర్ ధరల పెంపు నిర్ణయాన్ని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత ‘కేంద్ర ప్రభుత్వ ఎన్నికల బిల్లు’ అంటూ అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఒకే రోజు గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వలస కూలీలు వినియోగించే 5 కిలోల సిలిండర్ ధర కూడా రూ.549 నుంచి రూ.810.50కి పెరిగిందని గుర్తుచేశారు. గడిచిన మూడు నెలల్లో గ్యాస్ ధరలు సుమారు 81 శాతం పెరిగాయని గుర్తుచేశారు.

వాణిజ్య సిలిండర్ ధరలు పెంచడమంటే టీ దుకాణాలు, చిన్న చిన్న హోటళ్లు, ధాబాలు, బేకరీలు నడుపుకునే వారి పొట్టకొట్టడమేనని మండిపడ్డారు. ఒక సామాన్యుడు బయట అల్పాహారం తినలేడని, కనీసం టీ తాగేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ధరల దాడి ఒక్క గ్యాస్ సిలిండర్ ధరలతో ఆగదని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని జోస్యం చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లాభాలను దండుకుందని, ఇప్పుడు ధరలు పెరగగానే ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో భారత ప్రభుత్వం ఇంధన ధరల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న వారం రోజుల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.40 నుంచి 50 వరకు పెరిగే అవకాశం ఉంది.