2 May, 2026 | 4:01 AM

నోష్ ల్యాబ్ ఫార్మాలో భారీ పేలుడు

02-05-2026 02:41 AM

ఒకరు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

కంపెనీ ముందు కార్మికుల ఆందోళన

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఘటన

చిట్యాల, మే 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ఫార్మా కం పెనీలో శుక్రవారం జరిగిన భారీ పేలుడు విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఒక రు మృతి చెందగా, మరో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నోష్ ల్యా బ్ ఫార్మా కంపెనీ మూడో బ్లాక్ ౩లో కెమికల్ మిక్సింగ్ జరుగుతున్న సమయంలో రియాక్టర్ ఆకస్మికంగా పేలిపోవడంతో మొ త్తం తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు.

గాయపడిన వారిలో చిన్న కాపర్తి గ్రా మానికి చెందిన బొడ్డు బాలకృష్ణ గౌడ్ (32) పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీఏ ఆసుపత్రికి తరలించి చికి త్స అందిస్తుండగా మృతి చెందాడు. గత నెల 9న ఇదే ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు గాయపడిన ఘటన ఇంకా మరిచిపోకముందే మరోసారి పేలు డు సంభవించడం కార్మికుల్లో భయాందోళన కలిగిస్తోంది. కార్మిక దినోత్సవం రోజునే తోటి కార్మికుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు కంపెనీ ముందు ఆందోళనకు దిగారు.

యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మం టలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచా రణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సహా సంబంధిత అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.