నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు
ఉప్పల్, జూలై 8 (విజయక్రాంతి): మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నాచారం ఎక్స్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షులు, నాచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.ఎస్. ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి తన పాలనలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన మహానేత ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
వైఎస్సార్ అందించిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి, రామ్ రెడ్డి, రమేష్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, ఎం. శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్, నర్సింగ్ రావు, సునీల్ రెడ్డి, షరఫుద్దీన్, నరేష్, రేవంత్, బాలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, షాహిద్, పాషా, కావేరి, అశోక్, తర్రి, రాజశేఖర్, ఉమా, యాసీమ్, అంజుమ్, మమతతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






