ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన
-ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూలై 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డిగూడలోని విజయదుర్గ దేవాలయం సమీపంలో చేపట్టిన డ్రైనేజీ పైపులైను పనులను ఆయన బుధవారం పరిశీలించారు. రూ.10 లక్షల వ్యయంతోచేపట్టిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. తద్వారా వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. మౌలిక వసతుల కల్పతో పాటు అభివృద్ధికి కూడా ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






