8 May, 2026 | 3:25 AM

ప్యాంక్రియాస్ కోల్పోతే జీవితాంతం ఇన్సులిన్!

08-05-2026 01:41 AM

అరుదైన శస్త్రచికిత్సతో యువతిని కాపాడిన కేర్ మలక్‌పేట్ వైద్యులు

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): సాధారణ కడుపు అసౌకర్యంగా ప్రారంభమైన సమస్య, జీవితాంతం మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడే పరిస్థితిగా మారే అవకాశం ఉంది. అయితే సమయానికి సరైన నిర్ధారణ, నిపుణుల వైద్యం వల్ల ఇబ్రహీంపట్నం చెందిన 33 ఏళ్ల సుష్మితకు ఆ ప్రమాదం తప్పింది.

కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్‌లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్యాంక్రియాస్‌ను కాపాడుతూ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన ట్యూమర్లు సాధార ణంగా ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు చూపవు. అందుకే చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారు. ఎక్కువగా శస్త్రచికిత్సలో భాగంగా ప్యాంక్రియాస్‌లో పెద్ద భాగాన్ని తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల జీవితాంతం మధుమేహం, జీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్యాంక్రియాస్ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.

ఇది ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి రక్తంలో చక్కెర స్థాయిని ని యంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ అవయవం పెద్ద భాగం తొలగితే రోగు లు జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా యువ రోగుల్లో ఇది జీవన నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ కేసులో కేర్ వైద్యులు విభిన్నంగా ఆలోచించారు. ట్యూమర్‌ను తొలగించడమే కాకుండా, ప్యాంక్రియాస్‌ను ఎంతవరకు కా పాడగలమన్న దానిపై దృష్టి పెట్టారు.

సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ గాస్ట్రో ఎంటె రోలోజి అండ్ రోబోటిక్ శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్, నేతృత్వంలో వైద్య బృందం ల్యాపరోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ అనే క్లిష్ట శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. తర్వాత రూక్స్-ఎన్-వై ప్యాంక్రియాటికో జెజునోస్టమీ ద్వారా అవయవాన్ని పునర్నిర్మిం చారు. ఈ శస్త్రచికిత్స అంత సులభం కాదు. రోగికి ప్యాంక్రియాస్ చాలా మృదువుగా ఉండటం, ప్యాంక్రియాటిక్ డక్ట్ పరిమాణం కేవలం 2 మిల్లీమీటర్లు మాత్రమే ఉండటం వల్ల శస్త్రచికిత్స మరింత సవాలుగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయడం చాలా అరుదు.అన్ని సవాళ్ల మధ్య శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి త్వరగా కోలుకుని ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా జీవితాంతం మధుమేహం లేదా జీర్ణ సమస్యల ప్రమాదం లేకుండా బయటపడటం ఈ కేసులో ప్రధాన విజ యం. డాక్టర్ భూపతి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ కేసులో మా లక్ష్యం ట్యూమర్‌ను తొలగించడం మాత్రమే కాదు, రోగి భవిష్యత్ జీవన నాణ్యతను కాపాడడం కూడా. ప్యాంక్రియాస్ ఎక్కువ భాగం తొలగిస్తే మధుమేహం వంటి సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా యువ రోగుల్లో అవయవా న్ని కాపాడటం చాలా ము ఖ్యం. ఈ శస్త్రచికిత్స సాంకేతికంగా క్లిష్టమైనదైనా, దీర్ఘకాల ప్రయోజనాలు స్పష్టంగా ఉంటాయి’, అన్నా రు. కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్లా మాట్లా డుతూ, ‘ఇప్పటి వైద్యం కేవలం వ్యాధిని నయం చేయడమే కాదు, రోగి జీవితాన్ని మెరుగుపర్చడంపై దృష్టి పెడుతోంది.

ఇలాంటి శస్త్రచికిత్సలు యువతకు ఎంతో మేలు చేస్తా యి. మా ఆస్పత్రిలో రోగి-కేంద్రిత సేవలను అందించడం మా ప్రధాన లక్ష్యం’, అన్నారు. కడుపులో స్వల్ప అసౌకర్య మున్నా, అది ఎక్కువ రోజులు కొనసాగితే నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. తొందరగా పరీక్షలు చేయించుకుంటే అవయవాన్ని కాపాడే చికిత్సలు చేసే అవకాశం ఉంటుందన్నారు. సమయానికి గుర్తింపు, సరైన వైద్యం, నిపుణుల చేతుల్లో చికిత్సఇవే ఒ క సాధారణ సమస్యను ప్రాణాపాయం నుంచి బయటపడే విజయకథగా మార్చాయి.