9 May, 2026 | 1:18 AM

స్కైరూట్ ఏరో స్పేస్ చరిత్ర

09-05-2026 12:00 AM
  1. మొదటి బిలియన్ డాలర్ స్టార్టప్
  2. తెలంగాణ స్టార్టప్ ఎకో సిస్టంకు ఇది గర్వకారణం
  3. సంస్థకు కేటీఆర్ అభినందనలు

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): భారతీయ స్పేస్-టెక్ రంగం నుంచి 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8 వేల కోట్లు) కంటే ఎక్కువ విలువను సాధించిన మొదటి స్టార్టప్‌గా స్కైరూట్ ఏరో స్పేస్ చరిత్ర సృష్టించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పం దించారు.

భారతదేశపు మొట్టమొదటి స్పేస్-టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి హృదయపూర్వక అ భినందనలు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా టీ-హబ్‌లో ప్రారంభమై, ఇంత తక్కువ సమయంలో ఈ అద్భుతమైన మై లురాయిని చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని, తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టంకు ఇది గర్వకారణమని ప్రశంసించారు.

భారతీయ ప్రతిభకు, ఆశయాలకు ఉన్న అపార మైన శక్తికి ఇది ఒక నిదర్శనమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆ కాక్షించారు. పవన్ కుమార్ చందన, భరత్ దకా స్కైరూట్ బృందానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణను, భారతదేశాన్ని ఇలాగే గర్వపడేలా చేస్తూ ఉం డాలని అభినందించారు. 

స్టార్టప్ ఎకో సిస్టంకు టీ-హబ్ గొప్ప సాధనం

హైదరాబాద్‌లో ప్రపంచం మెచ్చే అద్భుతమైన స్టార్టప్ ఎకో సిస్టంను నిర్మించడంలో టీ--హబ్ ఒక గొప్ప సాధనంగా పనిచేసిందని స్కైరూట్ ఏరో స్పేస్ కో ఫౌండర్, సీఈ వో పవన్ కుమార్ చందన పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయాణంలో గత ప్రభుత్వం పోషించిన పాత్రను, స్టార్టప్ ఎకోసిస్టంను, ముఖ్యంగా టీ-హబ్ పాత్రను గుర్తుచేసుకుంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలోని ఇన్నోవేషన్ హ బ్స్‌లో ఉన్న ’ప్లగ్-అండ్-ప్లే’ సౌకర్యాలు, సహకార వాతావరణం వల్ల తాము సంక్లిష్టమైన ఇంజనీరింగ్ పనులపై దృష్టి సారించి, సంస్థ ను వేగంగా విస్తరించగలిగామని ఆయన చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ యూనికార్న్‌లా ఎదగడం వల్ల రాష్ట్రంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

టీ--హబ్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక ఇన్నోవేషన్ హబ్, ఎకోసిస్టం ప్రభుత్వం, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయాన్ని సాధించి స్టార్టప్‌ల వృద్ధికి తోడ్ప డుతూ, అగ్రగామి ఆవిష్కరణల వ్యవస్థకు నాయకత్వం వహిస్తోందన్నారు.