రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతున్న ఎద్దుల పందేలు
కోదాడ, ఏప్రిల్ 5 : కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని వరవర రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎద్దుల యజమానులు తమ పశు సంతతిని పోటీల్లో పాల్గొనేందుకు తీసుకొనివచ్చారు.
18సంవత్సరాల తర్వాత గ్రామంలో ఎద్దుల పందేలు జరుగుతుండడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 6వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఇర్లా వరహాలరెడ్డి విజయలక్ష్మి, సర్పంచ్ స్నేహలత దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, సానికొమ్ము తరుణ్ కుమార్ రెడ్డి, ధనమూర్తి, శ్రీనివాసరావు, కరుణాకర్ రెడ్డి, గురవయ్య, బండి చిన కోటయ్య, కాసాని శీను, కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.




