12 June, 2026 | 1:42 AM

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ..

12-06-2026 12:34 AM

నిజాంసాగర్, జూన్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం నాడు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  అందించారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికీ ఆర్థికంగా అండగా ఉండేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో మంజూరయిన ముఖ్యమంత్రి సహాయని చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు బుజంగారి భాస్కర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి,, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సంకు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.