ప్రైవేటు ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ సీజ్
మహబూబాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో అనుమానస్పద గర్భాస్రావం జరిగినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ తన బృందంతో గురువారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీలలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ కు అనుమానస్ప ద కుటుంబ నియంత్రణ ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగినదని, హాస్పిటల్ యొక్క రికార్డు లను, కేసు యొక్క షీట్లను ఇతర సంబంధిత పత్రాలను స్వాధీన పరుచుకొని, ఈ యొక్క కేసు మహబూబాబాద్ జిల్లా పరిదిలో కా నందున, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారిని సంప్రదించడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ సం దర్భంగా ఆసుపత్రి యొక్క ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విరాజిత, డాక్టర్ రాజ్ కుమార్, లోక్య, ప్ర శాంత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.






