6 April, 2026 | 3:46 AM

రోడ్డు పైకి మురుగు రాకుండా చర్యలు

06-04-2026 01:54 AM

కోదాడ ఏప్రిల్ 5: కోదాడ మునిసిపల్ పరిధిలోని 13 వ వార్డు నయా నగర్ అనంత గిరి రోడ్ లో డ్రైన్ కట్టినా రోడ్డు పైకే మురుగు నీరు ప్రవహిస్తుండడంపై కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు స్పందించారు. ఆదివారం వార్డు కౌన్సిలర్ గుర్వమ్మ సైది బాబు తో కలిసి రోడ్డు పైకి వస్తున్న మురుగును పరిశీలించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు.