15 July, 2026 | 1:43 AM

తెలంగాణలో బీఎస్పీనే ప్రత్యామ్నాయం

15-07-2026 12:00 AM
  1. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
  2. అక్టోబర్ 9న బహిరంగ సభను విజయవంతం చేయాలి 

ఎల్బీనగర్, జూలై 14 : తెలంగాణలో కాం గ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కంటే బహుజన్ స మాజ్ వాది పార్టీ ప్రత్యమ్నాయ మని బీఎ స్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ధీమా వ్య క్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యవర్గ సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ నేతలు,రాష్ట్ర చీఫ్ సెంట్రల్ కో ఆర్డినేటర్లు అథర్ సింగ్ రావ్, సురేష్ ఆర్య ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వచ్చే ఎన్నిక ల్లో బీఎస్పీ అధికారంలోకి వచ్చేలా రాజకీయాలు చేయబోతున్నామన్నారు. పార్టీని గ్రామగ్రామనా తీసుకెళ్లాలని, బహుజన స మాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించాల ని,పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూ చించారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయిని ప్రేరేపించేలా పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు ఒక్క బీఎస్పీ మాత్రమే న్యాయం చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చి న వెంటనే నేరెళ్ల బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బహుజనులైన ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజన వర్గాలు బీఎస్పీకి అధికారం కట్టబెట్టి అగ్రకుల పార్టీలను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు.

వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలో వ చ్చేలా వ్యూహ రచన చేస్తున్నామని ఇబ్రాం శేఖర్ పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు  శ్రీరాం కృష్ణ, చీఫ్ జోన్ ఇన్ చార్జ్‌లు దయానంద్ రావు, ఈశ్వర్, నిశాని రాంచందర్, ప్రధాన కార్యదర్శులు ధర్మేందర్, రవీందర్ నాయక్, పృథ్వీరాజ్, కార్య దర్శులు యాదగిరి, అనితా రెడ్డి, నాగన్న, కోశాధికారి ప్రణయ్, పార్లమెంట్ ఇన్ చార్జ్ లు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.