విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ఎస్‌ఐ పద్మ
శంకర్‌పల్లి: జూలై 14(విజయ క్రాంతి): విద్యార్థులు మారకద్రవ్యాలకు దూరంగా ఉంటూ బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్త్స్ర పద్మ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పొద్దుటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు మారకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలు దూరంగా ఉంటూ సమాజంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.
క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలతో పాటు వారి కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి ప్రవర్తన పై ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






