4 August, 2026 | 1:48 AM

బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

03-08-2026 08:43 PM

20 వేల ఆర్థిక సాయం

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త షేక్ జావిద్  గత కొన్ని రోజుల కింద చెట్టుపై నుండి కింద పడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్  రాష్ట్ర నాయకుడు  మహమ్మద్  ముజీబ్  తెలుసుకున్నారు. సోమవారం రోజున  ఉట్నూర్ కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్న బిఆర్ఎస్ కార్యకర్త షేక్ జవీద్  కుటుంబాన్ని పరామర్శించారు.

కార్యకర్త ఆరోగ్యం తోపాటు  కుటుంబ పరిస్థితిని  తెలుసుకొని  తనవంతుగా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ముజీబ్ అనంతరం ముజీబ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలో పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆయనతోపాటు మాజీ వైస్ ఎంపీపీ సలీమోద్దీన్ బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.