3 September, 2026 | 1:05 AM

కాంగ్రెస్ 420 హామీలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్

03-09-2026 | 12:07am

అమలులో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం

భారీ ఫ్లెక్సీలతో ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు...

మంచిర్యాల / ఆదిలాబాద్ / నిర్మల్ / కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజక వర్గ కేంద్రాలలో ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్‌ఎస్ పోరుబాట’ను బుధవారం చేపట్టారు.

అన్ని నియోజక వర్గ కేంద్రాలలో ‘కాంగ్రెస్ 420 హామీల’తో కూడిన 420 అడుగుల ప్లెక్సీల తో భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్రధాన కూడళ్ల వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ. 500 గ్యాస్ సిలిండర్ హా మీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వా న్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బా ధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జోగు రామన్న సవాల్ విసిరారు.

బోథ్ లో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆందోళనలు నిర్వహించి కొట్లాడి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తీ సుకువస్తే, అన్ని రంగాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తుందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావుల ఆధ్వర్యంలో ఐ బీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర థియేటర్, అ ర్చనటెక్స్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, మంచిర్యాల బస్టాండు మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

బెల్లంపల్లి చౌరస్తా వద్ద పెద్ద మొత్తంలో మానవహారం చేసి నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలో మాజీ ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య ఆధ్వర్యం లో నిరసన ర్యాలీ నిర్వహించి కాంటా అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చె న్నూర్ నియోజక వర్గ కేంద్రంలో మాజీ ఎం పీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమ న్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 

నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి, మా ర్గొండ రాము, డాక్టర్ సుభాష్ రావు, నజీర్ ఖాన్, బైంసాలో శ్యాంసుందర్, కిరణ్ కారి, గాద విలాస్, ఖానాపూర్ లో జాన్సన్ నాయ క్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ 420 హామీల చీటింగ్, ఆరు గ్యారంటీలు మోసంపై ప్రచా రం చేస్తూ ప్లెక్సీతో భారీ ర్యాలీలు నిర్వహించారు.

నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు, భైంసాలో అంబేద్కర్ విగ్రహం ముందు, ఖానాపూర్ లలో ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభు త్వం 1000 రోజుల పాలనలో హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎం ఎల్‌ఏ కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, భారీ నిరసనలు నిర్వ హించారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.