3 September, 2026 | 2:05 AM

ఇక అధిష్ఠానానిదే నిర్ణయం

03-09-2026 | 01:04am

హైదరాబాద్, సెప్టెంబర్  2 (విజయక్రాంతి): ఢిల్లీలోని ఇందిరాభవన్‌(Indira Bhavan,)లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షినటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. రాష్ట్రం లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల(political situation)పై వివరించారు. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ(Konda Surekha),  మాజీ మంత్రి చిన్నారెడ్డి(Chinna Reddy)లు చేసిన వ్యాఖ్యలపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక(party disciplinary committee report)ను కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చారు.

మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిష్‌లోకి అనువదించిన కాపీని అందజేశారు. అంతుకుముందు మహేష్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయినప్పుడు జరిగిన పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలి సింది. సమావేశం అనంతరం మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులపై చర్చతో పాటు మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపై నివేదిక ఇచ్చామని, ఇక నిర్ణ యం అధిష్ఠానమే తీసుకోవాల్సి ఉందని తెలిపారు.