శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు
02-09-2026 | 08:27pm
ములకలపల్లి,సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ములకలపల్లి(Mulakalapalli) గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు అయిత శేషగిరిరావు గతకొన్ని రోజులు క్రితం శస్త్రచికిత్స చేయించుకొని ములకలపల్లిలోని ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనను జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ గడల శ్రీనివాస్ రావు (Dr. Gadala Srinivasa Rao) బుధవారం సాయంత్రం శేషగిరిరావు ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు రాము, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్,జిల్లా నాయకులు గరిక రాంబాబు, స్థానిక ఉపసర్పంచ్ పువ్వాల లలితారావు,మున్నూరు కాపు సంఘం మండల నాయకులు పువ్వాల మంగపతి,బేతాళ వెంకన్నబాబు,పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






