2 September, 2026 | 9:19 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

02-09-2026 | 08:24pm

కాగజ్‌నగర్‌, సెప్టెంబర్‌ 2(విజయ క్రాంతి): కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన రాయితీ పీడీఎస్‌(PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(Enforcement) అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు కాగజ్‌నగర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 10 బస్తాల సుమారు 4 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటో సీజ్‌(Auto Seized) చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడిగా ఎండీ. అస్లాం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉచిత బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.