రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు
మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలోని హనుమంతరావు నగర్ కు చెందిన రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్న(Gundepaka Venkanna) అత్యంత ప్రతిష్టాత్మక ది ఐకానిక్ ఇండియా అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జీవీఎస్ ఫౌండేషన్(GVS Foundation) ఏర్పాటుచేసి ఈ ఫౌండేషన్ ద్వారా సమాజంలోని వృద్ధులు, పేదలు ,అనాధల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నను ఉత్తర ప్రదేశ్ చెందిన ప్రముఖ సామాజిక సేవా సంస్థ త్రేతాయుగ ఫౌండేషన్ 2026 2027 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ది ఐకానిక్ ఇండియా అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ మేరకు ఆయనకు ది ఐకానిక్ ఇండియా అవార్డు తోపాటు ట్రోఫీ, మెడల్ ను అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ తన వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనకు ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ది ఐకానిక్ ఇండియా అవార్డు స్ఫూర్తితో రానున్న రోజుల్లో జివిఎస్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ఈ ప్రాంతంలోని పేదలు ,వృద్ధులు, అనాధ పిల్లల సంక్షేమం కోసం మరింతగా కృషి చేస్తామన్నారు.






